Breaking: వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తిరుపతిలో పర్యటించారు...

Update: 2024-01-28 10:25 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తిరుపతిలో పర్యటించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిర్వహించిన సమవేళంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్న జగన్ జైలుకు వెళ్లిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. ఆ సమయంలో తాను చేసిన పాదయాత్రను సైతం సమావేశంలో ప్రస్తావించారు. జగన్ లేకున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాను ఎనలేని కృషి చేశానని తెలిపారు. కానీ కనీస కృతజ్ఞత కూడా ఆ పార్టీ నాయకులకు లేదని ఎద్దేవా చేశారు. తన వ్యక్తి గత జీవితంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని జగన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. పులి కడుపునే పులే పుడుతుందని.. ఎవరెన్ని వ్యక్తి గత విమర్శలు చేసినా.. తాను మాత్రం భయపడేది లేదని షర్మిల హెచ్చరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు, జగన్ ఏలుబడికి ఆకాశం, పాతాళానికి ఉన్న తేడా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. హంద్రీనీవా ప్రాజెక్టును వైఎస్సార్ 90 పూర్తి చేస్తే జగన్ ఆ 10 శాతం కూడా పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీని సైతం ఆమె వదిలిపెట్టలేదు. రామమందిరం కట్టిన మోడీ ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. తిరపతి సభలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోడీ, బీజేపీకి మద్దతు తెలుపుతున్న జగన్ కేడీలేనని షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.


Similar News