ఏపీలో అభివృద్ధిపై దుష్ప్రచారం.. సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం
మరో 9 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని, ఇవి పేదల భవిష్యత్తును నిర్ణయిస్తాయని సీఎం జగన్ తెలిపారు...
దిశ, వెబ్ డెస్క్: మరో 9 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని, ఇవి పేదల భవిష్యత్తును నిర్ణయిస్తాయని సీఎం జగన్ తెలిపారు. నెల్లూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విలువలు, విశ్వసనీయత మధ్య కురక్షేత్రం జరుగుతోందని, ఓటేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని జగన్ పిలుపునిచ్చారు. తాము ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని కోరారు. ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన చేశామని చెప్పారు. రూ. 2 లక్షల 70 వేల కోట్లు డైరెక్ట్‌గా లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేశామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 99 శాతం పూర్తి చేశామన్నారు. తమ పాలనలో అభివృద్ధి లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్తగా17 మెడికల్ కాలేజీలు, 4 సీపోర్టులు, 10 హార్బర్లు కడుతున్నామని చెప్పారు. అలాగే రామాయపట్నం పోర్టు పూర్తి కాబోతోందని తెలిపారు. నాడు నేడుతో స్కూళ్ల రూపు రేఖలు మార్చేశామన్నారు. పేద విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేశామని, గ్రామ స్వరాజ్యం అంటే ఇదేనని సీఎం జగన్ పేర్కొన్నారు.
Read More..
Pawan Kalyan: ఆ విషయంలో సొంత రక్తానికైనా ఎదురు తిరుగుతా.. పవన్ కళ్యాణ్