CM Chandrababu : ఆర్ అండ్ బీ శాఖపై.. ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష!

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ధ్వంసమైన రోడ్ల మరమ్మత్తులపై దృష్టి పెట్టాలని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్ అండ్ బీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Update: 2024-09-13 10:36 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ధ్వంసమైన రోడ్ల మరమ్మత్తులపై దృష్టి పెట్టాలని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్ అండ్ బీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ఆర్ అండ్ బీ శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. వరదల వల్ల మొత్తం ఎన్ని కిలోమీటర్ల మేర, రోడ్లు దెబ్బతిన్నాయన్న విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అయితే, ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు దెబ్బతిన్నాయని ఆర్ అండ్ బీ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీంతో ప్రాధాన్యతల వారిగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనాలపై రివ్యూ నిర్వహించిన చంద్రబాబు, ఆ తర్వాత విజయవాడ లోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, ఇంకా ఇన్స్యూరెన్స్ ఏజెన్సీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు చంద్రబాబు. కాగా ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు వేలాది వాహనాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.


Similar News