Ap News: సీఎం చంద్రబాబు కార్యక్రమం వాయిదా

ఏపీ సీఎం చంద్రబాబు ఈ వారం నిర్వహించనున్న ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా పడింది...

Update: 2024-07-03 15:42 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు ఈ శనివారం నిర్వహించనున్న ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా పడింది. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రతి శనివారం ప్రజా సమస్యలు వినడంతో పాటు వినతులు స్వీకరించాల్సిన నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ప్రజా వేదిక పేరుతో ఇప్పటికే రెండు శనివారాలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే ఈసారి మాత్రం అనూహ్యం ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా పడింది. సీఎం ఢిల్లీ పర్యటన, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ నేపథ్యంలో శనివారం ప్రజా వినతులను స్వీకరించడంలేదని అధికారికంగా పార్టీ నాయకులు ప్రకటించారు. ఈ శనివారం కాకుండా పై వచ్చే వారంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా వేదిక కార్యక్రమాన్ని కొనసాగించనున్నారని స్పష్టం చేశారు. ఈ నెల 6న టీడీపీ కార్యాలయానికి ప్రజలు రావొద్దని పిలుపునిచ్చారు.

కాగా సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులను గురువారం కలవనున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ బయల్దేరారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోడీతో చంద్రబాబు కలువనున్నారు. ఆ తర్వాత కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. అమరావతి, పోలవరం, ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధానితో పాటు కేంద్రమంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు నివేదిక అందించనున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత ఈ నెల 6న హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న విభజన సమస్యలపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా శనివారం జరగాల్సిన ప్రజా వేదిక కార్యక్రామాన్ని వాయిదా వేశారు.

Read more...

CM చంద్రబాబుపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం 


Similar News