AP CID: చంద్రబాబుపై మరో పిటిషన్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబును కస్టడీ ఇవ్వాలని ఏపీ సీఐడీ కోరుతోంది. ...

Update: 2023-09-21 12:36 GMT

దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబును కస్టడీ ఇవ్వాలని ఏపీ సీఐడీ కోరుతోంది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించింది. ఇందుకు సంబంధించిన తీర్పు శుక్రవారం ఉదయం రానుంది. ఇంతలోనే చంద్రబాబుపై మరో పిటిషన్‌ను సీఐడీ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ఐదు రోజలు పాటు కస్టడీకి ఇస్తే కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు బయటకు వస్తాయని సీఐడీ పిటిషన్‌లో పేర్కొంది.

అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరపున పిటిషన్ దాఖలు అయింది. మరోవైపు ఏపీ ఫ్రైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. 

Tags:    

Similar News