Andhra Pradesh:రేపు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదం

సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన రేపు(సోమవారం) మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) జరగనుంది.

Update: 2025-03-16 14:41 GMT

దిశ,వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన రేపు(సోమవారం) మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశం(Meeting)లో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులుకు కేబినెట్ ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని అమరావతి(Amarawati)లో CRDA చేపట్టనున్న 22 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం.

రాష్ట్రం(Andhra Pradesh)లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన 10 సంస్థలతో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన SIPB ఆమోదం తెలిపింది. ఆ పది సంస్థలు రాష్ట్రంలో పెట్టనున్న రూ.1,21,659 కోట్ల పెట్టుబడులకు రేపు ఆమోదం తెలుపనున్నట్లు తెలుస్తోంది. లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖలో రూ.1,500 కోట్ల పెట్టుబడులతో నిర్మించే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇంకా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

READ MORE ...

Tenth Exams: టెన్త్ పరీక్షలకు సర్వంసిద్ధం.. సీఎం చంద్రబాబు కీలక ట్వీట్


Tags:    

Similar News