రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు.. సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(capital Amaravati.0 నిర్మాణానికి మరో ముందడుగు పడింది.. రాజధాని నగర వ్యాప్తంగా.. పనులు ప్రారంభించడానికి సీఆర్డీఏ(CRDA) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అతి త్వరలో.. రూ.2,498 కోట్లతో రహదారుల పనులు మొదలు పెట్టనున్నారు. సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రూ. 1508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు నిర్మాణంతో పాటు మూడు రిజర్వాయర్లని నిర్మించనున్నారు. రూ.3, 523 కోట్లతో అధికారుల నివాస భవంతుల నిర్మాణం, 217 చదరపు కిలోమీటర్లలో రోడ్లు, భవనాల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.