Bay of Bengal: ఏపీకి మరో ముప్పు...!

దక్షిణ బంగాళాఖాతంలో ఈరోజు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది....

Update: 2024-12-07 06:26 GMT
Bay of Bengal: ఏపీకి మరో ముప్పు...!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ బంగాళాఖాతం(South Bay of Bengal)లో ఈరోజు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఫెంగల్ తుపాను(Cyclone Fengal) ఎఫెక్ట్‌తో ఏపీ, తమిళనాడు(AP, Tamil Nadu)తో భారీగా వర్షాలు(Heavy rains) కురిశాయి. తుఫాన్ తీరం దాడటంతో రెండు రాష్ట్రాల ప్రజలు ఊపరిపీల్చుకున్నారు. అయితే ఇంతలోనే మరో గండం గడగడలాడిస్తోంది. హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెదర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఉపరితర ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 12నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. దీని ఎఫెక్ట్‌తో 11, తేదీల్లో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. 12వ తేదీన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని సమయాల్లో పిడుగులు సైతం పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలు పడుతున్న వేళ రైతులు చెట్ల కిందకు వెళ్లొద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు. 

Tags:    

Similar News