Ap News: దూకుడు పెంచిన సోము వీర్రాజు.. ఏకంగా సీఎం జగన్‌కే సవాల్
ఏపీలో బీజేపీ అగ్రనేతల పర్యటన తర్వాత రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది....
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో బీజేపీ అగ్రనేతల పర్యటన తర్వాత రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జగన్ సర్కార్‌పై ఏకంగా కేంద్రమంత్రి అమిత్ షా అవినీతి ఆరోపణలు చేయడంతో రాష్ట్ర బీజేపీ నేతలు దూకుడు పెంచారు. జగన్ ప్రభుత్వంపై మాటల దాడి పెంచారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా తామే చేశామని చెబుతున్నారు. అంతేకాదు అభివృద్ధి విషయంలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసురుతున్నారు.
తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా సీఎం జగన్‌ను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని పిలుస్తున్నారు. తాము చర్చకు సిద్ధమని.. సీఎం జగన్, వైసీపీ నేతలు రెడీగా ఉన్నారా? అని సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ పథకాలు 3 కోట్ల మందికి అందాయని, వైసీపీ ఒక్క కి.మీ రోడ్డు కూడా వేయలేదని సోము వీర్రాజు విమర్శించారు. బీజేపీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని, రాష్ట్రంలో జనసేనతోనే బీజేపీ పొత్తు అని సోము వీర్రాజు స్పష్టం చేశారు.