11 స్థానాలకు వైసీపీ MP అభ్యర్థులు ఫిక్స్.. సోషల్ మీడియాలో లిస్ట్ వైరల్..!

పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కసరత్తులో వేగంగా పెంచాయి. ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు వ్యూహాలు

Update: 2024-01-27 08:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కసరత్తులో వేగంగా పెంచాయి. ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికలో అచితూచీ వ్యవహరిస్తున్నాయి. ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలకు భిన్నంగా వైసీపీ చీఫ్, సీఎం జగన్ పక్కా స్ట్రాటజీ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. వ్యతిరేకత ఉన్న అభ్యర్థులకు టికెట్ నిరాకరించడం లేదా నియోజకవర్గాల మార్పు చేస్తున్నారు. ఇన్‌చార్జుల మార్పు, అభ్యర్థుల నియోజక వర్గాల మార్పు వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగానే, మరో 11 ఎంపీ స్థానాలకు జగన్ అభ్యర్థులను ఫిక్స్ చేసినట్లు.. సోమవారం జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ స్థానాలపై స్పష్టత రావడంతో అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించున్నట్లు సమాచారం. విజయనగరం మజ్జి శ్రీనివాస్‌, అనకాపల్లి అమర్నాథ్‌, కాకినాడ చలమలశెట్టి సునీల్ పేర్లు ఫైనల్ అయినట్లు టాక్. అమలాపురం నుండి ఎలిజా, రాజమండ్రి-గూడూరు శ్రీనివాస్‌/ పద్మలత, నరసాపురం-గోకరాజు రంగరాజు/ శ్యామలా దేవిల ఎవరో ఒకరు బరిలోకి దిగనున్నట్లు సమాచారం. గుంటూరు-కావటి మనోహర్/ ఉమ్మారెడ్డి వెంకటరమణ, నరసరావుపేట నుండి మాజీ మంత్రి అనిల్‌కుమార్, కర్నూలు బీవై రామయ్య, నంద్యాల-ఖాదర్‌బాషా/ అలీ, నెల్లూరు-వేమిరెడ్డి పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్‌ను సోమవారం అధికారికంగా ప్రకటించున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

Tags:    

Similar News