Amaravati Drone Summit-2024: నేడు అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 ప్రారంభం.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు

ఏపీని దేశంలో డ్రోన్ హబ్‌ (Drone Hub)గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

Update: 2024-10-22 03:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీని దేశంలో డ్రోన్ హబ్‌ (Drone Hub)గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర అభివృద్ధితో పాటు యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. అమరావతి రాజధాని (Amaravati Capital)ని డ్రోన్ క్యాపిటల్‌ (Drone Capital)గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) టెక్నాలజీని మరింత విస్తృతం చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ (Vijayawada)లోని పున్నమి ఘాట్ (Punnami Ghat) సమీపంలో ఉన్న సీకే కన్వెన్షన్ (CK Convension) వేదికగా ఇవాళ, రేపు డ్రోన్ సమ్మిట్‌ను అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై డ్రోన్ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. దాదాపు 5,500 డ్రోన్లతో సర్కార్ ఈ మెగా షో నిర్వహిస్తుంది. ఇప్పటికే సమ్మిట్‌లో పాల్గొనేందుకు 6,929 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని అధికారులు తెలిపారు. అయితే, ప్రజలంతా ఈ షోను చూసేందుకు తిల‌కించ‌డానికి న‌గ‌ర వ్యాప్తంగా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా విజయవాడ (Vijayawada)లోని బెంజ్ స‌ర్కిల్‌, రామ‌వ‌ర‌ప్పాడు, వార‌ధి, బ‌స్టాండ్‌, ప్రకాశం బ్యారేజీల ప్రాంతాల్లో భారీ ఎల్‌ఈడీ స్కీన్ల (LED Screens)ను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే, డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ (AP Drone Corporation) కార్యదర్శి సురేశ్ కుమార్ (Suresh Kumar) ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

లాజిస్టిక్స్, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, భూ సర్వే, మీడియా, వైద్యం లాంటి 9 అంశాలపై డ్రోన్ల వాడకం, ఉపయోగాలను ఈ సమ్మిట్‌లో వక్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power Point Presentation) ఇవ్వనున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ (Drone Technology)ని ఇతర మానవ అవసరాలకు విస్తరించేలా సదస్సులో చర్చించనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న డ్రోన్ల తయారీదారులు వారి ఉత్పత్తులకు సంబంధించి 40 స్టాళ్లకు పైగా ఏర్పాటు చేయనున్నారు.


Similar News