AP:‘మా భూములు మాకు కేటాయించండి’..శివగిరి నిర్వాసితుల ఆవేదన

తమకు కేటాయించిన భూములు సర్వే చేసి తమకు అప్పగించి న్యాయం చేయాలని పోలవరం మండలం శివగిరి నిర్వాసితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Update: 2024-08-05 11:58 GMT

దిశ,జీలుగుమిల్లి:తమకు కేటాయించిన భూములు సర్వే చేసి తమకు అప్పగించి న్యాయం చేయాలని పోలవరం మండలం శివగిరి నిర్వాసితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సోమవారం పి.నారాయణపురంలో వారు మాట్లాడుతూ గ్రామంలో 218 ఎకరాల ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. ఈ భూములకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని తెలిపారు. అయితే ఇటీవల కొంతమంది భూముల్లోకి వచ్చి పామాయిల్ పంటను తీసుకెళ్లడమే కాకుండా భూములను బోర్లను, పంపులను నాశనం చేశారన్నారు. ఇంకా తమ గ్రామానికి 70 ఎకరాలు భూమి కేటాయించాల్సి ఉందని అన్నారు.

అయితే ఈ భూమిని గత కొంత కాలంగా కౌలుకు ఇచ్చి జీవనోపాధి పొందుతున్నామన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి భూములు నా సర్వే చేసి ఎవరి వాటాలు వాళ్లకు అప్పగించాలని కోరుతున్నారు. ఇదే విషయంపై పి.అంకంపాలెం వీఆర్వో ముత్యాలరావును వివరణ కోరగా శివగిరి నిర్వాసితులకు భూములు ప్రభుత్వం భూములు కేటాయించిందని, కొంత భూమి జల్లేరు రిజర్వాయర్‌లో ఉందని, ఇంకా మిగులు భూమి ఎంత ఉందో తమ వద్ద డేటా లేదని ముత్యాలరావు తెలిపారు. నిర్వాసితుల సమస్యను తహసీల్దర్‌కు తెలియజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరగంటి కృష్ణకుమారి, బాడిస తమ్మన్న దొర, కొవ్వాసి రాములమ్మ, కథల విజయ తదితరులు పాల్గొన్నారు.


Similar News