AP:‘ఉపాధి హామీ బాకీలను వెంటనే చెల్లించాలి’..వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరులో ముంపు గ్రామాల్లోని పేదలకు ఉపాధి హామీ పనుల బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.

Update: 2024-07-30 14:21 GMT

దిశ, ఏలూరు:జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరులో ముంపు గ్రామాల్లోని పేదలకు ఉపాధి హామీ పనుల బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. వేలేరుపాడు మండలంలో అనేక గ్రామాలు పెద్ద వాగు గండి వల్ల ముంపు గురై ప్రజలు సర్వస్వం కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్న అధికారులు ఉపాధి హామీ డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రతినిధులు అధికారులు ముంపు ప్రాంతాలను సందర్శించి తమదైన శైలిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కానీ ఉపాధి హామీ పనులు చేపట్టిన అధికారులు మాత్రం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఈ రెండు మండలాల్లో ముంపు గ్రామాల పేదలకు ఉపాధి హామీ చేసిన వారికి బకాయి కూలీ డబ్బులు చెల్లించాలని ఆయన కోరారు.


Similar News