బ్రేకింగ్: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు..హైకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ..!
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఉత్తర్వులను కొట్టేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇవాళ ఏపీ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరుఫున సుప్రీంకోర్టు ప్రముఖ లాయర్లు సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ తరుఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరువర్గాల వాదనలు ముగిశాయి. అనంతరం ఈ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. దీంతో హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో అని అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించండంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.