Ap: ఏసీబీ వలలో చేనేత జౌళిశాఖ అధికారి

ఏసీబీ వలకు చేనేత జౌళిశాఖ అధికారి చిక్కారు..

Update: 2025-02-24 12:03 GMT
Ap: ఏసీబీ వలలో చేనేత జౌళిశాఖ అధికారి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఏసీబీ(ACB) వలకు మరో అవినీతి అధికారి దొరికారు. లంచం( Bribe) తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. లంచం తీసుకోవద్దని ఏసీబీ అధికారులు చెబుతున్నా కొందరు అధికారులు పట్టించుకోవడం లేదు. జోరుగా బల్ల కింద చేయి చాపుతున్నారు. అందినకాడికి తీసుకుని జేబులు నింపుకుంటున్నారు.

తాజాగా అన్నమయ్య జిల్లా(Annamayya District)కు చెందిన అవినీతి అధికారి(Corrupt officer) పని పట్టారు ఏసీబీ అధికారులు. కడప ఏసీబీ డీఎస్పీ ప్రశాంతి ఆధ్వర్యంలో జిల్లా చేనేత జౌళి శాఖ(Handloom textile department)లో తనిఖీలు చేశారు. లబ్ధిదారుడు నుంచి రూ. 70 లంచం తీసుకుంటున్న జౌళిశాఖ అధికారి కృష్ణయ్య(Textile Officer Krishnaih)ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చేనేత శాఖలో లబ్ధిదారుడి నుంచి కృష్ణయ్య లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పథకం పన్ని అవినీతి అధికారి భరతం పట్టారు ఏసీబీ అధికారులు. ఈ ఘటనతో అన్నమయ్య జిల్లా జౌళిశాఖలో కలకలం రేగింది.

Tags:    

Similar News