పేదరికం లేని సమాజం నందమూరి తారక రామారావు కల: సీఎం చంద్రబాబు నాయుడు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు నాయకులు, అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) నాయుడు మంగళవారం పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు నాయకులు, అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ముందస్తు ప్రణాళికల్లో భాగంగా సీఎం మొదట యల్లమంద గ్రామంలో సామాజిక పింఛన్లు(Pensions) అందజేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏడుకొండలు అనే లబ్ధిదారుని ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతులతో కాఫీ పెట్టాడు. అలాగే భర్త చనిపోయిన సారమ్మ అనే మహిళకు పింఛన్ అందజేసిన సీఎం.. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని స్థానిక అధికారులకు సీఎం ఆదేశించారు.
అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమం(Face-to-face program)లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పేదరికం లేని సమాజం నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao) కల.. సంపద సృష్టించాలి పేదరికం నిర్మూలించాలి అనేది తన ఆశయం అని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా.. 64 లక్షల మందికి ఏపీ ప్రభుత్వం ఇస్తుందని.. ఎన్టీఆర్ ప్రారంభించిన పెన్షన్ కార్యక్రమం.. రూ. 200 నుంచి 2000 చేసింది టీడీపీ ప్రభుత్వమేనని.. గత ప్రభుత్వం ముక్కుతూ మూలుగుతూ 3000 చేసిందని.. తాను అధికారంలోకి రాగానే పెన్షన్ 4000 చేశానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.