Breaking: మార్గదర్శి చిట్స్‌కు భారీ షాక్.. రూ.793 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

Update: 2023-05-29 15:06 GMT
Breaking: మార్గదర్శి చిట్స్‌కు భారీ షాక్.. రూ.793 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఆ సంస్థకు చెందిన రూ.793 కోట్ల ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో అవకతవకలు జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. చట్టవిరుద్ధంగా, చిట్స్ యాక్ట్‌కు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారని ప్రధానమైన అభియోగం ఉంది. ఏపీలో వసూలు చేసిన చిట్స్‌ను ఇతర ప్రాంతాలు, కంపెనీలకు తరలించారనే మరో అభియోగం కూడా ఉంది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీకి చెందిన ఆస్తులను అటాచ్ చేస్తూ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 

Tags:    

Similar News