పోర్న్ వీడియోలకు బానిసైన భర్త.. భార్యను అలా చేయాలని ఒత్తిడి.. చివరకు ఏమైందంటే?
పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయిన ఓ భర్త(Husband Addicted to Porn తన భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.

దిశ,వెబ్‌డెస్క్: పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయిన ఓ భర్త(Husband Addicted to Porn తన భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. భార్యను పోర్న్ వీడియోలు చూడమని ఒత్తిడి తెచ్చాడు. అంతటితో ఆగకుండా పోర్న్ వీడియోలో చేసినట్లు చేయాలంటూ భార్యను బలవంతం చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని విశాఖపట్నంలోని గోపాలపట్నంలో విషాద ఘటన వెలుగు చూసింది.
భర్త పోర్న్ వీడియోస్‌కి బానిస అయ్యాడని మనస్తాపంతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. గతేడాది వారిద్దరికీ పెళ్లి అయింది. అప్పటి నుంచి పోర్న్ వీడియోలు చూపించి అలాగే చేయాలని భార్యపై భర్త ఒత్తిడి తెచ్చాడు. దీంతో మానసిక ఒత్తిడికి గురై ఆమె ఆత్మహత్య(Wife Dies by Suicide) చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ క్రమంలో తమ కూతురు మృతి పై ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.