Fish:మత్స్యకారుల వలకు చిక్కిన భారీ చేప..ఎక్కడంటే?
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అప్పుడప్పుడు అరుదైన చేపలు వలలో చిక్కుతుంటాయి.
దిశ,వెబ్‌డెస్క్: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అప్పుడప్పుడు అరుదైన చేపలు వలలో చిక్కుతుంటాయి. అంతే కాదు కొన్నిసార్లు భారీ చేపలను కూడా పట్టుకుంటున్నారు. అయితే తాజాగా చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. వివరాల్లోకి వెళితే..కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు టేకు చేప చిక్కింది. ఈ టేకు చేప 1500 కిలోల బరువు ఉన్నట్లు తెలుస్తోంది. క్రేన్ సాయంతో ఆ భారీ చేపను బయటకు తీశారు. ఈ టేకు చేపను చెన్నైకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారు..అయితే ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.