Atrocious: బాలికను రేప్ చేసి.. చంపేసిన మైనర్లు.. ఇంకా దొరకని డెడ్‌బాడీ
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది....
దిశ, వెబ్ డెస్క్: బాలికను రేప్ చేసి మైనర్లు చంపేశారు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు అవుతున్నా మృతదేహం దొరకలేదు. మైనర్లను అదుపులోకి తీసుకుని పోలీసులు గాలిస్తున్నారు. ఐదు రోజులు క్రితం నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన బాలికపై మైనర్లు అత్యాచారం చేసి అనంతరం చంపేశారు. బాలిక మృతదేహాన్ని ముచ్చుమర్రి ఎత్తిపోతల కాలువలో పడేశారు. అయితే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కాలువలో 4 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. అయినా బాలిక మృతదేహం లభ్యం కాలేదు. దీంతో నిందితులను రహస్యంగా విచారించారు. ఈ మేరకు వేర్వేరు స్థలాలు చూపించారు. అయితే ఆ స్థలాల్లో బాలికను పూడ్చి పెట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయా స్థలాల్లో ఉన్న చెట్ల పొదలను జేసీబీలతో తొలగిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలిక బంధువులు ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.