గుంతలమయంగా జాతీయ రహదారి

అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద నుంచి జీలుగుమిల్లి జగదాంబ గుడి ప్రధాన సెంటర్ వరకు జాతీయ రహదారి గుంతలతో అధ్వానంగా తయారయింది.

Update: 2024-08-08 12:53 GMT

దిశ,జీలుగుమిల్లి:అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద నుంచి జీలుగుమిల్లి జగదాంబ గుడి ప్రధాన సెంటర్ వరకు జాతీయ రహదారి గుంతలతో అధ్వానంగా తయారయింది. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చిన్న చిన్న గోతులు కాస్త పెద్ద పెద్ద గుంతలుగా మారి ప్రయాణానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షాలు తగ్గిన తర్వాత వచ్చేటువంటి విపరీతమైన దుమ్ముతో ప్రయాణం చేయడం కూడా కష్టమైపోతుందని మంచిగా ఉన్న రోడ్డును కాస్త మరమ్మత్తుల పేరుతో తవ్వి రెండు నెలలు కావస్తున్నా ఇంత వరకు కనీసం ఎవరు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎన్‌హెచ్‌డి ఈ శ్రీనివాస్‌నీ వివరణ అడుగగా వర్షాలు పడటం వల్ల పని ఆలస్యం అవుతుందని వారం రోజులలో పని పూర్తి చేస్తామని తెలిపారు.


Similar News