ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : ఫ్యాన్ గాలితో సేద తీరుతున్న వైసీపీ శ్రేణులు
దిశ, ఏపీ బ్యూరో: ఫ్యాన్స్పీడుకు సైకిల్ పంక్చరైంది. గ్లాసు గల్లంతయింది. పురపోరు ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈపాటికే సగం కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. మిగతా సగంలోనూ ముందుకు దూసుకుపోతోంది. మొత్తం 12 కార్పొరేషన్లలో ఒక్క దానిలోనూ టీడీపీ గట్టి పోటీ ఇవ్వలేపోయింది. చాలా చోట్ల రెండంకెల స్థానాలు రాలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫలితాలపై హైకోర్టు ఆంక్షలున్నందున జిల్లాలో మిగిలినవన్నీ వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఇక మున్సిపాలిటీల్లోనూ వైసీపీ హవా కొనసాగుతోంది. మధ్యాహ్నానికి వచ్చిన […]
దిశ, ఏపీ బ్యూరో: ఫ్యాన్స్పీడుకు సైకిల్ పంక్చరైంది. గ్లాసు గల్లంతయింది. పురపోరు ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈపాటికే సగం కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. మిగతా సగంలోనూ ముందుకు దూసుకుపోతోంది.
మొత్తం 12 కార్పొరేషన్లలో ఒక్క దానిలోనూ టీడీపీ గట్టి పోటీ ఇవ్వలేపోయింది. చాలా చోట్ల రెండంకెల స్థానాలు రాలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫలితాలపై హైకోర్టు ఆంక్షలున్నందున జిల్లాలో మిగిలినవన్నీ వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఇక మున్సిపాలిటీల్లోనూ వైసీపీ హవా కొనసాగుతోంది. మధ్యాహ్నానికి వచ్చిన ఫలితాలను చూస్తే మొత్తం 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో 50 పైగా వైసీపీ సొంతం చేసుకుంది. మిగతా వాటిలోనూ ముందంజలో కొనసాగుతోంది.
♦అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో టీడీపీ స్పష్టమైన మెజార్టీతో సాధించుకుంది. కడప జిల్లాలోని మైదుకూరులో నువ్వా నేనన్నట్టు సాగి అతి కష్టం మీద గెలిచింది. కడప నగరపాలక సంస్థతో సహా నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో వైసీపీ ఖాతాలోకి వెళ్లాయి.
♦చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్‌తోపాటు అన్నీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు అక్కడ మున్సిపాలిటీలు వైసీపీ ఖాతాలోకే చేరాయి.
♦ప్రకాశం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. గుంటూరు కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోనూ వైసీపీ స్వీప్‌చేసింది.
♦కర్నూలు కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని దాదాపు అన్ని పురపాలక సంఘాల్లోనూ ఫ్యాన్హవా కొనసాగింది. నంద్యాలలో లెక్కింపు కొనసాగుతోంది.
♦విజయవాడ కార్పొరేషన్‌కు సంబంధించి మొదటి 23 డివిజన్ల ఫలితాల్లో 19 వైసీపీ, 4 టీడీపీ గెల్చుకున్నాయి. మిగతా డివిజన్లలో లెక్కింపు కొనసాగుతోంది.
♦తూర్పుగోదావరి జిల్లాలోనూ అధికార పార్టీ విజయపరంపర కొనసాగుతోంది. మండపేట, పిఠాపురం, ముమ్మిడివరంలో నువ్వా నేనా అన్నట్లు వైసీపీ, టీడీపీకి పోటాపోటీగా ఫలితాలున్నాయి.
♦ మండపేట మున్సిపాల్టీలోని 30 వార్డు్ల్లో 10 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. అందులో 6 టీడీపీ కైవసం చేసుకోగా 4 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు.
♦ పిఠాపురం మున్సిపాల్టీలో టీడీపీ, వైసీపీ చెరో నాలుగు స్థానాలు దక్కించుకున్నాయి.
♦అమలాపురం, తుని, రామచంద్రాపురం, గొల్లప్రోలు, సామర్లకోట, ఏలేశ్వరం, మున్సిపాలిటీల్లో వైసీపీ విజయదుందుభి మోగించింది.
♦ఇక్కడ నుంచి మొత్తం ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏ ఒక్క చోట ప్రతిపక్ష టీడీపీ గట్టి పోటీనివ్వలేకపోయింది. జనసేన, గోదావరి జిల్లాల్లో రెండంకెలు దాటని ఫలితాలొచ్చాయి. వామపక్షాలు అక్కడక్కడా ఒకటీ అరా సాధించుకున్నాయి