మొక్కలు నాటిన యాంకర్ ఉదయభాను

దిశ, న్యూస్‌బ్యూరో: ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రముఖ యాంకర్ ఉదయభాను ఆదివారం జూబ్లీహిల్స్‌లోని పార్కులో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ మొక్కలను నాటడం మనందరి కర్తవ్యం అన్నారు. ముందు తరాల వారికి మంచి వాతావరణం అందించడం మన బాధ్యత అని గుర్తు చేశారు. ఆక్సిజన్ లేకుండా నిమిషం కూడా ఉండలేమని, ప్రకృతికి కోపం వస్తే ఏమవుతుందో మనందరం కళ్ళారా చూశామన్నారు. నాకు ప్రకృతి అంటే చాలా […]

Update: 2020-06-21 05:52 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రముఖ యాంకర్ ఉదయభాను ఆదివారం జూబ్లీహిల్స్‌లోని పార్కులో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ మొక్కలను నాటడం మనందరి కర్తవ్యం అన్నారు. ముందు తరాల వారికి మంచి వాతావరణం అందించడం మన బాధ్యత అని గుర్తు చేశారు. ఆక్సిజన్ లేకుండా నిమిషం కూడా ఉండలేమని, ప్రకృతికి కోపం వస్తే ఏమవుతుందో మనందరం కళ్ళారా చూశామన్నారు. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టమని, అందుకే నా ఇద్దరు కూతుళ్లకు భూమి, ఆరాధ్య అని పేర్లు పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రముఖ హీరోయిన్ రేణు దేశాయ్, సంపత్ నంది, హాస్య నటుడు బ్రహ్మానందంకు ఛాలెంజ్ విసిరారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిశోర్ గౌడ్ పాల్గొన్నారు.

Tags:    

Similar News