ప్లీజ్ సార్ అంటూ కేటీఆర్‌ను ఆశ్రయించిన యాంకర్ రష్మి.. ఏం జరిగింది.?
దిశ, వెబ్‌డెస్క్ : ప్లీజ్ సార్.. సాయం చేయండి అంటూ.. యాంకర్ రష్మీ మంత్రి కేటీఆర్‌ను రిక్వెస్ట్ చేసింది. ఇంతకీ విషయం ఏంటని అనుకుంటున్నారా.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని శునకాల దుస్థితిని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లింది. శునకాలను కాపాడాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. జంతు పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఆమె.. యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి వాటిని రోడ్లపై వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని సూచించింది. […]
దిశ, వెబ్‌డెస్క్ : ప్లీజ్ సార్.. సాయం చేయండి అంటూ.. యాంకర్ రష్మీ మంత్రి కేటీఆర్‌ను రిక్వెస్ట్ చేసింది. ఇంతకీ విషయం ఏంటని అనుకుంటున్నారా.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని శునకాల దుస్థితిని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లింది. శునకాలను కాపాడాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. జంతు పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఆమె.. యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి వాటిని రోడ్లపై వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని సూచించింది. అయితే.. రష్మి జంతు ప్రేమికురాలనే విషయం అందరికీ తెలిసిందే. మూగ జీవాలకు ఏదైనా హాని జరిగితే ఆమె వెంటనే స్పందిస్తుంది. లాక్‌డౌన్‌లోనూ వీధి కుక్కలు, పావురాల కోసం ప్రతిరోజూ ఆహారం అందించేది. అంతేకాదు.. జంతు పరిరక్షణ కోసం ఆమె ప్రత్యేకంగా పలు అవగాహన కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వస్తోంది.
ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ పరిధిలో శునకాలకు ఏబీసీ(యానిమల్ బర్త్ కంట్రోల్) ఆపరేషన్ చేసి అలాగే వదిలేస్తున్నారంటూ.. దీనికి ఏదైనా పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆమె మంత్రి కేటీఆర్‌ను కోరింది. ఈ మేరకు ఆమె ట్విటర్ వేదికగా కేటీఆర్ కార్యాలయ ఖాతాతో పాటు కేటీఆర్ వ్యక్తిగత ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. మరి కేటీఆర్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.
విషయం ఏంటంటే..
గతం కొంతకాలంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధికుక్కల సంతతిని తగ్గించేందుకు ఆ శునకాలకు వైద్య సిబ్బంది ఆపరేషన్ చేసి అలాగే వదిలేస్తున్నారు. ఆపరేషన్ తర్వాత చేయాల్సిన చికిత్స చేయకుండానే శునకాలను రోడ్లపైనే విడిచిపెడుతున్నారు. ఇలా అయితే.. 2,122 శునకాలను ఆపరేషన్ చేసి ఇలాగే నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేసి వెళ్లారు అధికారులు. ఈ మేరకు శునకాల ఫొటోలను వివరాలతో సహా ’సేవ్ యానిమల్స్ ఇండియా’ అనే ట్విటర్ ఖాతా ద్వారా ఓ నెటిజన్ కొంతకాలంగా ట్విటర్‌లో పోస్టు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మూగజీవాలను కాపాడాలని యాంకర్ రష్మి మంత్రి కేటీఆర్‌ను కోరింది.
హుజురాబాద్ బైపోల్.. కేసీఆర్‌కు ఊహించని షాక్
రెండు రోజుల్లో కార్యాచరణకు రంగం సిద్ధం
@KTRTRS @KTRoffice https://t.co/dYKTm25Vq2
— rashmi gautam (@rashmigautam27) July 29, 2021
@KTRoffice @KTRTRS https://t.co/eVnWyT5Qpu
— rashmi gautam (@rashmigautam27) July 29, 2021