మహీంద్రుడి మదిలో అలనాటి జ్ఞాపకాలు

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలోని ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన పోస్టులు, వీడియోలకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర స్పందిస్తుంటారు. వాటిని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి మరింత మందికి వాటిని చేరువ చేస్తుంటారు. అయితే ఆయన ఈసారి.. టైమ్ మెషీన్ ఎక్కి.. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాడు. అలనాటి చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు ఆయన. ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేసుకున్నారు. దానికి జతగా ‘అమ్మతో పుస్తకాలకు బ్రౌన్ […]

Update: 2020-04-23 06:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలోని ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన పోస్టులు, వీడియోలకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర స్పందిస్తుంటారు. వాటిని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి మరింత మందికి వాటిని చేరువ చేస్తుంటారు. అయితే ఆయన ఈసారి.. టైమ్ మెషీన్ ఎక్కి.. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాడు. అలనాటి చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు ఆయన.

ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేసుకున్నారు. దానికి జతగా ‘అమ్మతో పుస్తకాలకు బ్రౌన్ కలర్ అట్టలు వేయించుకోవడమంటే నాకెంతో ఇష్టం. కోవిడ్ న్యూస్ కంటే కూడా ఈ బాల్యపు జ్ఞాపకాలు మరింత మధురమైనవి’ అంటూ రాసుకొచ్చారు.

వీడియోలో ఏముందంటే…

ఈ వీడియోలో బాల్యాన్ని గుర్తు చేసే అనేక విషయాలు ఉన్నాయి. అవి మనల్ని ఇంటర్నెట్ లేని రోజులకు తీసుకెళతాయి. వాటితో తమకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను ఆనాటి తరానికి గుర్తుకు చేస్తాయి. అలనాటి టెలిఫోన్‌‌లు, కెమెరా ఫిల్మ్ రోల్స్ , మ్యూజిక్ క్యాసెట్ల ఫొటోలు వీడియోలో వస్తుంటే.. ఆ రోజులన్నీ కళ్లముందు కదలాడతాయి. చిడియా ఉడ్, ఖో ఖో, కచ్చకాయలు ఆడటం, బ్రౌన్ పేపర్ కవర్లతో నోట్ బుక్‌లకు అట్టలు వేయడం, ఇలా.. అప్పట్లో చిన్న, చిన్న విషయాలే.. ఎంతో ఆనందాన్ని పంచేవి. అవే కాదు.. ఆనాటి రోజుల్లోని ఫేమస్ ప్రొడక్ట్స్ .. నట్‌రాజ్ పెన్సిల్స్, కంపాక్స్ బాక్స్, వాటర్ గేమ్స్, లిటిల్ హార్ట్స్ బిస్కట్స్, రస్నా ఫ్రూటీ, లక్స్ సబ్బు, నిర్మా వాషింగ్ పౌడర్, జెల్లీ బెల్లీస్ వంటి మరెన్నింటినో ఆయన ఈ వీడియోలో ఉంచారు. గోల్‌మాల్ చిత్రంలో.. కిషోర్ కుమార్ పాడిన ‘ఆనే వాలా పాల్ జేన్ వాలా హై’ అనే పాట ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతోంది. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఒక గంటలోనే, ఈ వీడియో వేల వ్యూస్ తో ఆకట్టుకుంటోంది. 90 ల నాటి వ్యక్తులకు కూడా ఈ వీడియో బాగా నచ్చుతోంది.

tags :nostalgia, anand mahindra, memories, twitter

Tags:    

Similar News