నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్రా అదిరిపోయే గిఫ్ట్

దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో క్రీడలో దేశానికి బంగారు పతకం సాధించిన అథ్లట్ నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షయం కురుస్తోంది. ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, దేశ ప్రధాని నరేంద్ర మోడీలు శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశ వందేళ్ల కల నెరవేర్చావంటూ అభినందించారు. అంతేగాకుండా.. నీరజ్ స్వరాష్ట్రం అయిన హర్యానా ప్రభుత్వం విజేతకు భారీ నజరానా ప్రకటించింది. తాజాగా.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర నీరజ్‌ చోప్రాను బాహుబలి అంటూ ప్రశంసించారు. ఈ క్రమంలో […]

Update: 2021-08-07 12:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో క్రీడలో దేశానికి బంగారు పతకం సాధించిన అథ్లట్ నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షయం కురుస్తోంది. ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, దేశ ప్రధాని నరేంద్ర మోడీలు శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశ వందేళ్ల కల నెరవేర్చావంటూ అభినందించారు. అంతేగాకుండా.. నీరజ్ స్వరాష్ట్రం అయిన హర్యానా ప్రభుత్వం విజేతకు భారీ నజరానా ప్రకటించింది. తాజాగా.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర నీరజ్‌ చోప్రాను బాహుబలి అంటూ ప్రశంసించారు. ఈ క్రమంలో రితేష్‌ జైన్‌ అనే ట్విటర్‌ యూజర్‌ నీరజ్‌ చోప్రాకు మహీంద్ర కంపెనీ త్వరలో లాంచ్‌ చేయనున్న ఎస్‌యూవీ శ్రేణికి చెందిన ఎక్స్‌యూవీ 700 (XUV 700)ని ఇవ్వాలిసిందిగా అభ్యర్థించాడు. రితేష్‌ అభ్యర్థనను అంగీకరించిన ఆనంద్‌ మహీంద్ర.. ‘‘తప్పకుండా ఇస్తాను. స్వర్ణం సాధించిన మా అథ్లెట్‌కు ఎక్స్‌యూవీ 700 (XUV 700)బహుమతిగా ఇవ్వడం నాకు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకం మాత్రమే కాక.. గౌరవం కూడా’’ అంటూ రిప్లై ఇచ్చారు.

Tags:    

Similar News