చేతి కర్రతో చిరుతకు చుక్కలు చూపించిన వృద్ధురాలు (వీడియో వైరల్)

దిశ, డైనమిక్ బ్యూరో: బల్లిని చూసే భయాందోళన చెందుతున్న ప్రస్తుత సమాజంలో ఓ వృద్ధురాలు వీరత్వం ప్రదర్శించింది. ఏకంగా చిరుతపులితో ఫైట్ చేసి, అందరి దృష్టిని ఆకర్శించింది. చేతి కర్రనే ఆయుధంగా మలుచుకొని చిరుతకు చుక్కలు చూపించింది. ప్రాణాలు పోయే క్షణంలో ప్రతిఒక్కరూ యోధులే అని ఆ అవ్వ నిరూపించింది. వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోని గోరెగావ్‌ ప్రాంతంలో గతవారం రోజులుగా చిరుతపులి సంచరిస్తోంది. రాత్రిళ్లు జనావాసాల్లోకి వచ్చి ఒంటరిగా కనిపించిన వారిపై దాడులు చేస్తూ భయాందోళనకు […]

Update: 2021-09-30 02:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బల్లిని చూసే భయాందోళన చెందుతున్న ప్రస్తుత సమాజంలో ఓ వృద్ధురాలు వీరత్వం ప్రదర్శించింది. ఏకంగా చిరుతపులితో ఫైట్ చేసి, అందరి దృష్టిని ఆకర్శించింది. చేతి కర్రనే ఆయుధంగా మలుచుకొని చిరుతకు చుక్కలు చూపించింది. ప్రాణాలు పోయే క్షణంలో ప్రతిఒక్కరూ యోధులే అని ఆ అవ్వ నిరూపించింది. వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోని గోరెగావ్‌ ప్రాంతంలో గతవారం రోజులుగా చిరుతపులి సంచరిస్తోంది. రాత్రిళ్లు జనావాసాల్లోకి వచ్చి ఒంటరిగా కనిపించిన వారిపై దాడులు చేస్తూ భయాందోళనకు గురిచేస్తోంది.

అయితే, బుధవారం రాత్రి ఇంటి బయట ఒంటరిగా కూర్చున్న వృద్ధురాలిపై చిరుత దాడికి యత్నించింది. ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చిన చిరుత.. ఆమెపై దాడికి దిగగా.. వెంటనే అప్రమత్తమైన వృద్ధురాలు ఆమె చేతి కర్రతో అరుస్తూ చిరుతపై ఎదురు దాడికి దిగింది. ఆమె అరుపులు విన్న స్థానికులు ఆమె వైపు పరిగెత్తుకు రావడం, అప్పటికే వృద్ధురాలు దాడి చేయడాన్ని గమనించిన చిరుత ప్రాణ భయంతో పారిపోయింది. ఈ సంఘటన సీసీ టీవీలో వీడియో రికార్డ్ కాగా, ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం వృద్ధురాలు క్షేమంగా ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు.

Tags:    

Similar News