ఆ పోలీస్ ట్రాన్స్‌ఫర్ అవుతుంటే.. అక్కడున్నవారికి కన్నీళ్లు ఆగలేదు (వీడియో)

దిశ, డైనమిక్ బ్యూరో: పోలీస్ అధికారి అన్నాక బదిలీలు, పదోన్నతులు సహజం. ఎవరికి వినని మోనార్క్ పోలీసులు ఆరు నెలలకోసారి ట్రాన్స్‌ఫర్ అవుతుంటారు. ఇంత కామన్ అయిన మ్యాటర్‌ని తన కుటుంబ సభ్యుడే దూరం అవుతున్నారని భావిస్తూ తోటి ఉద్యోగులు, ప్రజలు కన్నీరు పెట్టుకున్న సంఘటనలు చాలా అరుదు. ఇలాంటి సంఘటనే గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. గుజరాత్ రాష్ట్రంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే విశాల్ పటేల్‌‌కు తను పనిచేసే స్టేషన్ నుంచి బదిలీ అయింది. ఈ సందర్భంగా […]

Update: 2021-11-26 03:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పోలీస్ అధికారి అన్నాక బదిలీలు, పదోన్నతులు సహజం. ఎవరికి వినని మోనార్క్ పోలీసులు ఆరు నెలలకోసారి ట్రాన్స్‌ఫర్ అవుతుంటారు. ఇంత కామన్ అయిన మ్యాటర్‌ని తన కుటుంబ సభ్యుడే దూరం అవుతున్నారని భావిస్తూ తోటి ఉద్యోగులు, ప్రజలు కన్నీరు పెట్టుకున్న సంఘటనలు చాలా అరుదు. ఇలాంటి సంఘటనే గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. గుజరాత్ రాష్ట్రంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే విశాల్ పటేల్‌‌కు తను పనిచేసే స్టేషన్ నుంచి బదిలీ అయింది. ఈ సందర్భంగా ఆయనకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన స్థానికులు, సహచరులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టేషన్ లోపలి నుంచి ఆయన కారు వరకూ పూలు చల్లుతూ చప్పట్లు కొడుతూ ఘనంగా వీడ్కోలు పలికారు. బదిలీ పై వెళ్తున్న విశాల్ పటేల్‌ను హత్తుకొని స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు. విశాల్ పటేల్ ప్రజలతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారని, కరోనా విజృంభించిన సమయంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడటంతో కీలకంగా పనిచేశారని స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News