యాక్టర్ అంటే సోషల్ మీడియా ప్రజెన్స్ కాదు : అమృతా రావు
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ నటి అమృతా రావు ఈ మధ్యే బేబీ బాయ్‌కు వెల్‌కమ్ చెప్పింది. ప్రస్తుతం తనకు ఫుల్ హ్యాపీ మూమెంట్స్ కాగా.. నటిగా కూడా తను ఎంత సంతోషంగా ఉండేదో తెలిపింది. ‘మై హూనా’ రిలీజ్ టైమ్‌లో కాలేజ్ స్టూడెంట్స్ ఎదురుగా నిలబడి ‘సంజనా సంజనా’ అంటూ తనను పిలవడం.. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మొహం మీద చేతులు పెట్టుకుని సిగ్గుపడటం ఇంకా గుర్తుందని తెలిపింది. ఈ ఘటన జరిగి ఏళ్లు […]
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ నటి అమృతా రావు ఈ మధ్యే బేబీ బాయ్‌కు వెల్‌కమ్ చెప్పింది. ప్రస్తుతం తనకు ఫుల్ హ్యాపీ మూమెంట్స్ కాగా.. నటిగా కూడా తను ఎంత సంతోషంగా ఉండేదో తెలిపింది. ‘మై హూనా’ రిలీజ్ టైమ్‌లో కాలేజ్ స్టూడెంట్స్ ఎదురుగా నిలబడి ‘సంజనా సంజనా’ అంటూ తనను పిలవడం.. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మొహం మీద చేతులు పెట్టుకుని సిగ్గుపడటం ఇంకా గుర్తుందని తెలిపింది. ఈ ఘటన జరిగి ఏళ్లు గడుస్తున్నా.. నిన్నే జరిగినట్లు అనిపిస్తోందని తెలిపింది.
2002లో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన టైమ్‌లో ‘ఇష్క్ విష్క్, మస్తీ, మై హూనా’ లాంటి సినిమాల్లో తన నటనను ప్రేక్షకులు గుర్తించారని.. అలా పాపులారిటీ వచ్చిందని తెలిపింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ సేపు గడపడం ద్వారా యాక్టర్స్ పాపులర్ అవుతున్నారని అభిప్రాయపడింది. అయితే నటుడు అనే వాడు సోషల్ మీడియా అప్పియరెన్స్‌తో కాకుండా తను చేసిన క్యారెక్టర్, సినిమా ద్వారా గుర్తించబడటం ఇంపార్టెంట్ అని అభిప్రాయపడింది.
అలాగని సోషల్ మీడియా ద్వారా పాపులర్ కావడాన్ని తానేమీ తప్పు పట్టడం లేదని చెప్పింది. ట్రాన్సిషన్ పీరియడ్‌లో తాను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యానని.. ఆ టైమ్‌లో నటుడికి టాలెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని, నైపుణ్యాన్ని పదునుపెట్టుకునేందుకు మరింత ప్రయత్నించేవాళ్లమని తెలిపింది అమృత. కానీ ఇప్పుడు టాలెంట్ మేనేజ్‌మెంట్ చాలని.. ఒక విధంగా ఇది మంచి మార్పేనని తెలిపింది. టాలెంట్ మేనేజ్‌మెంట్ అనేది ఆర్టిస్టులకు ఉద్యోగ అవకాశంతో పాటు మరింత భద్రతను కలిగిస్తుందని వివరించింది.