ఈ ఏడాది తనకెంతో ప్రత్యేకం అంటున్న హైదరాబాదీ అమ్మాయి

దిశ, వెబ్ డిస్క్: గ్లామర్ ప్రపంచంలో మన తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ.. ఒకవేళ వచ్చినా కొన్ని సినిమాలకే పరిమితమవుతున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి వేరే ఇండస్ట్రీలో కూడా తమ ప్రత్యేకతను నిరూపించుకుంటున హీరోయిన్లు లేకపోలేదు. ఇక ఈ తెలుగమ్మాయిల లిస్ట్ లో చేరిపోయింది అచ్చ తెలుగు హైదరాబాదీ హీరోయిన్ అమ్రిన్ ఖురేషి. ఏప్రిల్ 11 అమ్రిన్ తన 22 వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంది. View this post on […]

Update: 2021-04-11 23:55 GMT

దిశ, వెబ్ డిస్క్: గ్లామర్ ప్రపంచంలో మన తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ.. ఒకవేళ వచ్చినా కొన్ని సినిమాలకే పరిమితమవుతున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి వేరే ఇండస్ట్రీలో కూడా తమ ప్రత్యేకతను నిరూపించుకుంటున హీరోయిన్లు లేకపోలేదు. ఇక ఈ తెలుగమ్మాయిల లిస్ట్ లో చేరిపోయింది అచ్చ తెలుగు హైదరాబాదీ హీరోయిన్ అమ్రిన్ ఖురేషి. ఏప్రిల్ 11 అమ్రిన్ తన 22 వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ” హీరోయిన్ అయ్యాకా ఇది నా మొదటి పుట్టినరోజు.. చాలా సంతోషంగా అనిపిస్తుంది. హైదరాబాద్ అమ్మాయిగా బాలీవుడ్ లో అడుగుపెడుతున్నా.. ఎంతో ఆనందంగా ఉంది. తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి.. హైదరాబాదీ అమ్మాయి అయినందుకు నేనెంతో గర్వపడుతున్నా.. ఈ సినిమా తర్వాత అటువైపు దృష్టి పెడతానంటూ” చెప్పుకొచ్చింది. ఇకపోతే తెలుగులో సూపర్‌హిట్‌ అయిన ‘సినిమా చూపిస్తమావ’ చిత్రాన్ని ‘బ్యాడ్‌బాయ్‌’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి హీరోగా పరిచయమవుతుండగా .. అతని సరసన అమ్రిన్ కనిపించనుంది. ఇదే కాకుండా ‘జులాయి’ హిందీ రీమేక్ లోను అమ్రిన్ కథానాయికగా కనిపించనుంది.

Tags:    

Similar News