బెజవాడలో ‘అమరావతి వాక్’
దిశ, ఏపీ బ్యూరో: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చేస్తున్న ఉద్యమం 300రోజులకు చేరింది. ఈ సందర్బంగా అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో ‘అమరావతి వాక్’ పేరిట ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో పాల్గొన్న నిరసన కారులు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ నినాదాలిచ్చారు. స్వార్థం కోసం రాజధానిని ముక్కలు చేయొద్దని డిమాండ్ చేశారు. ర్యాలీలో పాల్గొన్న అక్కినేని వనజ మాట్లాడుతూ అమరావతి శ్మశానం కాదని, అభివృద్ధికి పునాదని పేర్కొన్నారు. రాజధానిని ముక్కలు చేస్తున్న రాష్ట్ర […]
దిశ, ఏపీ బ్యూరో: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చేస్తున్న ఉద్యమం 300రోజులకు చేరింది. ఈ సందర్బంగా అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో ‘అమరావతి వాక్’ పేరిట ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో పాల్గొన్న నిరసన కారులు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ నినాదాలిచ్చారు. స్వార్థం కోసం రాజధానిని ముక్కలు చేయొద్దని డిమాండ్ చేశారు. ర్యాలీలో పాల్గొన్న అక్కినేని వనజ మాట్లాడుతూ అమరావతి శ్మశానం కాదని, అభివృద్ధికి పునాదని పేర్కొన్నారు. రాజధానిని ముక్కలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం వత్తాసు పలకడం విచిత్రంగా ఉందన్నారు. కాంగ్రెస్నేత సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ రైతుల త్యాగంతో ఏర్పడిన అమరావతి రాజధానిని కూల్చడం జగన్రెడ్డి తరం కాదని హెచ్చరించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించేదాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం గాంధీనగర్ తాలూకా కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు.