రండి..మాట్లాడుకుందాం..రైతు సంఘాలకు అమిత్ షా ఆహ్వానం
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. అన్నివర్గాల ప్రజలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండు చేస్తున్నాయి. బుధవారం కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య ఆరో విడత చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాత్రి 7గంటలకు చర్చలకు రావాలని రైతు సంఘాల నేతలను కేంద్ర హోం […]
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. అన్నివర్గాల ప్రజలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండు చేస్తున్నాయి. బుధవారం కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య ఆరో విడత చర్చలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాత్రి 7గంటలకు చర్చలకు రావాలని రైతు సంఘాల నేతలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చలకు ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్న అమిత్ షా చర్చలకు ఆహ్వానించడంతో రైతుల సమస్యకు ఏదైనా పరిష్కారం లభిస్తుందని అందరు భావిస్తున్నారు.