ఆ ప్రమాదపు గాయాల గురించి బిగ్‌బీ..
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. తన కెరియర్‌లో ఎదుర్కొన్న ఎన్నో సవాళ్ల గురించి చెబుతుంటారు. లాక్‌డౌన్ సమయంలో ఇలాంటి బోలెడన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నబిగ్‌బీ.. 1982లో కూలీ సినిమా షూటింగ్ టైమ్‌లో జరిగిన ప్రమాద విషయాలను పంచుకున్నారు. ‘సినిమా సెట్‌లో జరిగిన ప్రమాదం తనను ఆల్మోస్ట్ కోమా కండిషన్‌కు తీసుకెళ్లిందన్న బచ్చన్.. ఆ యాక్సిడెంట్ తర్వాత తనను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారని చెప్పారు. ఐసీయూలో క్రిటికల్ కండిషన్‌లో ఉన్న తనను బతికించేందుకు […]
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. తన కెరియర్‌లో ఎదుర్కొన్న ఎన్నో సవాళ్ల గురించి చెబుతుంటారు. లాక్‌డౌన్ సమయంలో ఇలాంటి బోలెడన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నబిగ్‌బీ.. 1982లో కూలీ సినిమా షూటింగ్ టైమ్‌లో జరిగిన ప్రమాద విషయాలను పంచుకున్నారు.
‘సినిమా సెట్‌లో జరిగిన ప్రమాదం తనను ఆల్మోస్ట్ కోమా కండిషన్‌కు తీసుకెళ్లిందన్న బచ్చన్.. ఆ యాక్సిడెంట్ తర్వాత తనను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారని చెప్పారు. ఐసీయూలో క్రిటికల్ కండిషన్‌లో ఉన్న తనను బతికించేందుకు డాక్టర్లు ముక్కులో పైపులు వేశారట. అయితే సెమీ కోమాలో ఉన్న బచ్చన్.. ఆ పైపుల్ని తీసేస్తుండటంతో దాన్ని ముక్కుకు కుట్టేశారట. ఆ సమయంలో ముఖంపై కలిగిన గాయాలను చూపిస్తూ ఓ పిక్ షేర్ చేశారు బచ్చన్.
మెడ కింద ఏర్పడ్డ గాయం గురించి చెప్పిన బిగ్‌బీ.. ఆ టైమ్‌లో లైఫ్ సేవ్ చేసేందుకు గొంతు కింద కట్ చేసి వైద్యులు ఒక పరికరాన్ని అమర్చారట. దీంతో మాట్లాడే వీల్లేకుండా పోయిందని చెప్పారు. ‘ఒకవేళ తనకు ఏదైనా కావాలి అనుకుంటే సైగ చేసేవాడినని, లేదంటే పేపర్ మీద రాసి చూపించే వాడిని’ అని అప్పటి సంగతులను గుర్తుచేసుకున్నారు.