‘వాళ్లు అతిపెద్ద కొవిడ్ సెంటర్‌ను పరిశీలించారు’
న్యూఢిల్లీ: దేశరాజధానిలో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ సెంటర్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరిశీలించారు. రెండు వేల బెడ్‌లతో ఛత్తర్‌పూర్ ఏరియాలో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్ శుక్రవారం నుంచి సేవలు ప్రారంభించింది. ఈ కొవిడ్ సెంటర్‌లోని వసతులను ఇరువురు నేతలు నిశితంగా పరిశీలించారు. ఈ ఆస్పత్రి పనివిధానాలను పర్యవేక్షిస్తున్న సీనియర్ అధికారులతో చర్చించారు. ఈ ఆస్పత్రి పర్యటించేందుకు అమిత్ షాను ఆహ్వానిస్తూ […]
న్యూఢిల్లీ: దేశరాజధానిలో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ సెంటర్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరిశీలించారు. రెండు వేల బెడ్‌లతో ఛత్తర్‌పూర్ ఏరియాలో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్ శుక్రవారం నుంచి సేవలు ప్రారంభించింది. ఈ కొవిడ్ సెంటర్‌లోని వసతులను ఇరువురు నేతలు నిశితంగా పరిశీలించారు. ఈ ఆస్పత్రి పనివిధానాలను పర్యవేక్షిస్తున్న సీనియర్ అధికారులతో చర్చించారు. ఈ ఆస్పత్రి పర్యటించేందుకు అమిత్ షాను ఆహ్వానిస్తూ ఈ కొవిడ్ సెంటర్‌లో సేవలందించడానికి ఆర్మీ, ఐటీబీపీ నుంచి వైద్య సిబ్బందిని అందించాలని సీఎం కేజ్రీవాల్ అభ్యర్థించిన సంగతి తెలిసిందే. దీనికి వెంటనే సమాధానమిస్తూ ఇప్పటికే ఆ డిమాండ్లను అంగీకరించామని, శుక్రవారం కల్లా ఈ సెంటర్ సేవలందిస్తుందని అమిత్ షా హామీనిచ్చారు.