ఆ ఆసుపత్రి ఐసీయూకు కల్నల్ సంతోష్ పేరు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డీఆర్డీవో నిర్మించిన తాత్కాలిక హాస్పిటల్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరిశీలించారు. 250 ఐసీయూలు, 1000 పడకల సామర్థ్యంతో ఉన్న ఈ కొవిడ్-19 ఆస్పత్రిని డీఆర్డీవో, టాటా సన్స్ సంయుక్తంగా నిర్మించాయి. రక్షణ శాఖకు చెందిన ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని భూభాగంలో కేవలం 11 రోజుల్లోనే నిర్మించారు. సర్దార్ పటేల్ పేరుగా ఉన్న ఈ కొవిడ్-19 హాస్పిటల్‌లో రక్షణ బలగాలు సేవలందిస్తాయి. ఈ […]

Update: 2020-07-05 04:54 GMT

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డీఆర్డీవో నిర్మించిన తాత్కాలిక హాస్పిటల్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరిశీలించారు. 250 ఐసీయూలు, 1000 పడకల సామర్థ్యంతో ఉన్న ఈ కొవిడ్-19 ఆస్పత్రిని డీఆర్డీవో, టాటా సన్స్ సంయుక్తంగా నిర్మించాయి. రక్షణ శాఖకు చెందిన ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని భూభాగంలో కేవలం 11 రోజుల్లోనే నిర్మించారు. సర్దార్ పటేల్ పేరుగా ఉన్న ఈ కొవిడ్-19 హాస్పిటల్‌లో రక్షణ బలగాలు సేవలందిస్తాయి. ఈ ఆస్పత్రిలోని ఐసీయూ, వెంటిలేటర్ వార్డులకు కల్నల్ బి.సంతోష్ బాబు పేరును పెట్టారు.

Tags:    

Similar News