గవర్నర్స్ కప్ టోర్నీ సెమీస్‌లో అమిత్ పంగల్

దిశ, స్పోర్ట్స్: రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న గవర్నర్స్ కప్ బాక్సింగ్ టోర్నీ సెమీస్‌లోకి భారత బాక్సర్ అమిత్ పంగల్ ప్రవేశించాడు. ఇప్పటికే ఒలంపిక్ 52 కేజీల విభాగంలో బెర్త్ సంపాదించిన అమిత్.. తన ప్రాక్టీస్‌కు పదును పెట్టుకోవడానికి అంతర్జాతీయ వేదికల్లో జరుగుతున్న టోర్నీల్లో పాల్గొంటున్నాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో రష్యాకు చెందిన తమిర్ గలానోవ్‌పై 5-0 బౌట్ల తేడాతో విజయం సాధించాడు. ఇప్పటికే భారత బాక్సర్లు సుమిత్ సంగ్వాన్ (81 కేజీలు), మొహమ్మద్ హుస్సాముద్దీన్ (57 కేజీలు), […]

Update: 2021-04-22 10:09 GMT

దిశ, స్పోర్ట్స్: రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న గవర్నర్స్ కప్ బాక్సింగ్ టోర్నీ సెమీస్‌లోకి భారత బాక్సర్ అమిత్ పంగల్ ప్రవేశించాడు. ఇప్పటికే ఒలంపిక్ 52 కేజీల విభాగంలో బెర్త్ సంపాదించిన అమిత్.. తన ప్రాక్టీస్‌కు పదును పెట్టుకోవడానికి అంతర్జాతీయ వేదికల్లో జరుగుతున్న టోర్నీల్లో పాల్గొంటున్నాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో రష్యాకు చెందిన తమిర్ గలానోవ్‌పై 5-0 బౌట్ల తేడాతో విజయం సాధించాడు. ఇప్పటికే భారత బాక్సర్లు సుమిత్ సంగ్వాన్ (81 కేజీలు), మొహమ్మద్ హుస్సాముద్దీన్ (57 కేజీలు), నమన్ తన్వార్ (91 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), వినోద్ తన్వార్ (49 కేజీలు) ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. దీంతో భారత్ తరపున ఉన్న ఏకైక బాక్సర్ అమిత్ పంగల్ మాత్రమే. ఓడిన వారిలో ఆశిష్ కుమార్ ఇప్పటికే ఒలంపిక్ బెర్త్ సాధించడం గమనార్హం.

Tags:    

Similar News