ప్లాస్మా చికిత్సకు యూఎస్ ఆమోదం
దిశ, వెబ్ డెస్క్ : కరోనా పేషెంట్లకు అత్యవసర చికిత్సగా ప్లాస్మా థెరపీ (plasma therapy) చయడానికి అమెరికా ఆమోదించింది. కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి ప్లాస్మా(రక్తం) సేకరించి దానితో పేషెంట్లకు చికిత్స చేస్తారు. అత్యవసర చికిత్సగా ప్లాస్మా థెరపీకి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్స్(food and drug administration) అనుమతించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కరోనా కట్టడి విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌డీఏ ప్లాస్మా థెరపీకి అనుమతి తెలిపింది. కాగా, ఎఫ్‌డీఏ (FDA) అనుమతిని […]
దిశ, వెబ్ డెస్క్ : కరోనా పేషెంట్లకు అత్యవసర చికిత్సగా ప్లాస్మా థెరపీ (plasma therapy) చయడానికి అమెరికా ఆమోదించింది. కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి ప్లాస్మా(రక్తం) సేకరించి దానితో పేషెంట్లకు చికిత్స చేస్తారు. అత్యవసర చికిత్సగా ప్లాస్మా థెరపీకి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్స్(food and drug administration) అనుమతించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కరోనా కట్టడి విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎఫ్‌డీఏ ప్లాస్మా థెరపీకి అనుమతి తెలిపింది. కాగా, ఎఫ్‌డీఏ (FDA) అనుమతిని ట్రంప్ ప్రశంసించారు. ఈ థెరపీ ద్వారా అమెరికా పౌరులను చైనా వైరస్ నుంచి రక్షించవచ్చునని వ్యాఖ్యానించారు. ప్లాస్మా థెరపీ సమర్థతపై ఇప్పటికీ నిపుణుల్లో ఏకాభిప్రాయం లేదు. ఈ థెరపీ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వ్యాపించవచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు.