టీఆర్ఎస్ ధర్నాలపై సందిగ్ధం.. కేసీఆర్ మల్లగుల్లాలు

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ చేపట్టిన మండల, నియోజకవర్గాల ధర్నాలపై సందిగ్ధం ఏర్పడింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఓవైపు… ఈ నెల 12న పీఎం మోడీ హైదరాబాద్ కు వస్తుండటంతో పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇప్పటికే ధర్నాలు విజయవంతం చేసి కేంద్రంపై ధాన్యం కొనుగోలు చేసేలా ఒత్తిడి పెంచాలని భావించిన అధికార పార్టీ ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఆదేశాలు సైతం జారీ చేసింది. అయితే ధర్నాలు నిర్వహిస్తే కేంద్రానికి తెలంగాణపై వ్యతిరేక […]

Update: 2021-11-10 11:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ చేపట్టిన మండల, నియోజకవర్గాల ధర్నాలపై సందిగ్ధం ఏర్పడింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఓవైపు… ఈ నెల 12న పీఎం మోడీ హైదరాబాద్ కు వస్తుండటంతో పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇప్పటికే ధర్నాలు విజయవంతం చేసి కేంద్రంపై ధాన్యం కొనుగోలు చేసేలా ఒత్తిడి పెంచాలని భావించిన అధికార పార్టీ ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఆదేశాలు సైతం జారీ చేసింది. అయితే ధర్నాలు నిర్వహిస్తే కేంద్రానికి తెలంగాణపై వ్యతిరేక భావం ఏర్పడే అవకాశం ఉంటుందా అనే దానిపై సందిగ్ధంలో పడింది.

యాసంగిలో ధాన్యం కొనబోమని కేంద్రం స్పష్టం చేయడంతో రైతుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఎలాగైనా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సీఎం కేసీఆర్ ఈ నెల 12న మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పిలుపు నిచ్చారు. పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని సూచించడంతో ఇప్పటికే నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కేంద్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్సీలు, మండల కేంద్రాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో కలెక్టర్ల అనుమతితో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ధర్నాలు చేసుకోవచ్చని సూచించింది. దీంతో పార్టీ శ్రేణులు ఆయా జిల్లాల్లో అనుమతి కోసం కలెక్టర్లకు దరఖాస్తు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ నెల 12న హైదరాబాద్ లోని నేషనల్ పోలీసు అకాడమిలో జరిగే ప్రోగ్రాంలో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. దీంతో అదే రోజు టీఆర్ఎస్ ధర్నాలు చేపడుతుండటంతో కేంద్రానికి వ్యతిరేక భావం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో ఏం చేయాలనే దానిపై పార్టీ అధిష్టానం మల్లగుల్లలు పడుతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News