సచిన్ వాజే కస్టడీ పొడిగింపు
ముంబయి : రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి ముందు బాంబు కేసులో అరెస్టైన ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు సచిన్ వాజే కస్టడీని ముంబయిలోని జాతీయ విచారణ ఏజెన్సీ (ఎన్ఐఎ) కోర్టు పొడిగించింది. ఆయన కస్టడీని ఈనెల 9 దాకా పెంచుతూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతనెల 13న ఎన్ఐఎ అధికారులు వాజేను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బుధవారంతో ఆయన కస్టడీ ముగియడంతో సచిన్ వాజేను కోర్టులో ప్రవేశపెట్టిన ఎన్ఐఎ.. మరో మూడు రోజుల […]
ముంబయి : రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి ముందు బాంబు కేసులో అరెస్టైన ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు సచిన్ వాజే కస్టడీని ముంబయిలోని జాతీయ విచారణ ఏజెన్సీ (ఎన్ఐఎ) కోర్టు పొడిగించింది. ఆయన కస్టడీని ఈనెల 9 దాకా పెంచుతూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతనెల 13న ఎన్ఐఎ అధికారులు వాజేను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బుధవారంతో ఆయన కస్టడీ ముగియడంతో సచిన్ వాజేను కోర్టులో ప్రవేశపెట్టిన ఎన్ఐఎ.. మరో మూడు రోజుల పాటు వాజేను తమకు అప్పగించాలని కోరింది. సచిన్ వాజేతో పాటు సస్పెండైన పోలీస్ కానిస్టేబుల్ వినాయక్ షిండే, క్రికెట్ బుకీ నరేష్ గోర్ లను కూడా ప్రత్యేక ఎన్ఐఎ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసుతోపాటు వాహనం యజమాని మన్‌సుఖ్ హిరేన్ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు సచిన్ వాజే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా, ఇదే కేసులో కూడా సీబీఐ కూడా సచిన్ వాజేను విచారించనున్నది. ఎన్ఐఎ కస్టడీలోనే వాజేను విచారించుకోవచ్చునని కోర్టు సూచించింది. కాగా, ఇదే కేసులో బుధవారం ఎన్ఐఎ ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌ను విచారించింది.