ఈ ఏడాది చివరి నాటికి అమెజాన్ దేశీయ ఉత్పత్తి
దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా విభాగం దేశీయంగా ఉత్పత్తిని నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మెక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ నేపథ్యంలో భాగంగా చెన్నైలోని ఫాక్స్‌కాన్ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఫాక్స్‌కాన్ సంస్థ టెక్ దిగ్గజం ఆపిల్, షావోమీ పరికరాలను తయారు చేస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా భారీగా ఫైర్ టీవీ స్టిక్ పరికరాల ఉత్పత్తిని ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించనుంది. డిమాండ్‌ను బట్టి భవిష్యత్తులో […]
దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా విభాగం దేశీయంగా ఉత్పత్తిని నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మెక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ నేపథ్యంలో భాగంగా చెన్నైలోని ఫాక్స్‌కాన్ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఫాక్స్‌కాన్ సంస్థ టెక్ దిగ్గజం ఆపిల్, షావోమీ పరికరాలను తయారు చేస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా భారీగా ఫైర్ టీవీ స్టిక్ పరికరాల ఉత్పత్తిని ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించనుంది. డిమాండ్‌ను బట్టి భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విస్తరించాలని అమెజాన్ భావిస్తోంది.
‘ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమానికి అమెజాన్ కట్టుబడి ఉంది. దేశీయంగా 10 లక్షల చిన్న, మధ్య తరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేయడానికి సుమారు రూ. 73 వేల కోట్ల పెట్టుబడులను పెట్టాలని నిర్ణయించాము. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులకు మార్కెట్ లభిస్తుంది. 2025 నాటికి దాదాపు 10 లక్షల ఉద్యోగాల సృష్టికి తమ పెట్టుబడి తోడ్పాటునందిస్తుందని’ అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ వెల్లడించారు. ‘భారత్ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగంలో ప్రధాన పాత్రను కలిగి ఉంటుందని, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి భారీస్థాయిలో స్పందనను చూస్తున్నాం. తాజాగా అమెజాన్ స్థానిక ఉత్పత్తికి ముందుకు రావడం సంతోషంగా ఉంది. దీనివల్ల దేశీయ ఉత్పత్తి రంగం మరింత బలోపేతమవుతుందని’ ఎలక్ట్రానిక్స్ శాఖ మాంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.