అద్భుతమైన ఆఫర్..అప్పిస్తామంటున్న అమెజాన్!
దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా సరికొత్త సర్వీసులను ప్రారంభించింది. ‘అమెజాన్ పే లేటర్’ సర్వీసు ద్వారా కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పు ఇస్తోంది. అమెజాన్ ఇండియాలో ఉన్న పరిమిత ఉత్పత్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నగదు లేకపోయినా ‘అమెజాన్ పే లేటర్’ నుంచి వస్తువులను కొనుగోలు చేసి ఎంపిక చేసుకున్న గడువులోగా చెల్లించవచ్చని, దీనికి ఎటువంటి వడ్డీ లేకుండా ఉపయోగించవచ్చని తెలిపింది. 12 నెలల ఈఎమ్ఐ ద్వారా […]
దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా సరికొత్త సర్వీసులను ప్రారంభించింది. ‘అమెజాన్ పే లేటర్’ సర్వీసు ద్వారా కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పు ఇస్తోంది. అమెజాన్ ఇండియాలో ఉన్న పరిమిత ఉత్పత్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నగదు లేకపోయినా ‘అమెజాన్ పే లేటర్’ నుంచి వస్తువులను కొనుగోలు చేసి ఎంపిక చేసుకున్న గడువులోగా చెల్లించవచ్చని, దీనికి ఎటువంటి వడ్డీ లేకుండా ఉపయోగించవచ్చని తెలిపింది. 12 నెలల ఈఎమ్ఐ ద్వారా కూడా చెల్లించే అవకాశం కూడా ఉందని, ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకున్న వారు 1.5 నుంచి 2 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ సౌకర్యం అమెజాన్ యాప్ నుంచి డీటీహెచ్ బిల్లులు, ఎలక్ట్రిసిటి బిల్లులు, మొబైల్ రీఛార్జ్‌లు చెల్లించవచ్చు. అలాగే, నిత్యావసర వస్తువులు, హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కూడా కొనవచ్చు. అమెజాన్ పే లేటర్ సేవల కోసం క్యాపిటల్ ఫ్లోట్, కరూర్ వైశ్య బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అమెజాన్ తెలిపింది.
దీనికోసం అమెజాన్ ఇండియా యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ ప్రస్తుతం డెస్క్‌టాప్ వెర్షన్‌లో అందుబాటులో లేదు. కేవలం యాప్‌లో మాత్రమే ఉంది. వినియోగదారులు ఆధార్ కార్డ్, పాన్ నంబర్, ఇతర వివరాలతో కూడిన కేవైసీ పూర్తి చేసిన తర్వాత రిజిస్టర్ అవుతుంది. వినియోగదారుల ఎలిజిబిలిటీని బట్టి రూ. 60,000 వరకూ ఈ సర్వీసు ద్వారా అప్పు ఇవ్వాలని అమెజాన్ నిర్ణయించింది. ఈ నగదు అవకాశం దేశ సెంట్రల్ బ్యాంక్ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం ఉండనుంది.
Tags: Amazon, Amazon India, Amazon Pay Later, zero-interest credit, EMI payment