ఇప్పుడు జియోమార్ట్ వంతు.. వాటా కోసం అమెజాన్ చర్చలు
దిశ, వెబ్‌డెస్క్: గత కొద్దిరోజులుగా రిలయన్స్ టెలికాం విభాగం జియోలో పెట్టుబడుల వరద తెలిసిన సంగతే. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అనుబంధ సంస్థ జియోమార్ట్‌లో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 9.9 శాతం వాటాను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. జియోమార్ట్‌లో వ్యూహాత్మక వాటాను కొనుగోలు చేసేందుకు అమెజాన్ ఆసక్తి చూపిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తితో పాటు లాక్‌డౌన్ నేపథ్యంలో పరిస్థితులను వ్యాపారానికి అనుకూలంగా మార్చుకునేందుకు మేలో వాల్‌మార్ట్, అమెజాన్‌కు పోటీగా రిలయన్స్ […]
దిశ, వెబ్‌డెస్క్: గత కొద్దిరోజులుగా రిలయన్స్ టెలికాం విభాగం జియోలో పెట్టుబడుల వరద తెలిసిన సంగతే. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అనుబంధ సంస్థ జియోమార్ట్‌లో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 9.9 శాతం వాటాను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. జియోమార్ట్‌లో వ్యూహాత్మక వాటాను కొనుగోలు చేసేందుకు అమెజాన్ ఆసక్తి చూపిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తితో పాటు లాక్‌డౌన్ నేపథ్యంలో పరిస్థితులను వ్యాపారానికి అనుకూలంగా మార్చుకునేందుకు మేలో వాల్‌మార్ట్, అమెజాన్‌కు పోటీగా రిలయన్స్ జియోమార్ట్‌ను తీసుకొచ్చింది. భారత్‌లో చిన్నా చితకా స్టోర్లను డిజిటల్ పరిధిలోకి తీసుకురావడానికి జియోమార్ట్ ఈ-సాంకేతికతను వినియోగిస్తోంది. ఇదివరకే జియోమార్ట్, వాట్సాప్ ద్వారా కొనుగోలుదార్లకు ఆర్డర్ పెట్టేందుకు అవకాశాన్ని ఇచ్చింది. ముందుగా ట్రయల్ కోసం పరిమిత ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించింది. మరికొద్దిరోజుల్లో దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని రిలయన్స్ భావిస్తోంది. కాగా, ఈ అంశంపై రిలయన్స్ కానీ, అమెజాన్ కానీ అధికారికంగా స్పందించలేదు.