తెరపైకి కొత్త చాలెంజ్ తీసుకొచ్చిన అల్లు కోడలు

దిశ వెబ్ డెస్క్: ఎప్పుడూ షూటింగ్ లతో బిజీబిజీగా గడిపే సెలబ్రెటీలంతా వంట‌లు, వ్యాయామాలు చేస్తూ.. కుటంబంతో హయిగా గడిపేస్తున్నారు. అంతేకాదు కొత్త కొత్త చాలెంజ్‌లు విసురుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ‘బీ ది రియ‌ల్ మేన్’ చాలెంజ్ నెట్టింట్లో వైరల్ గా మారింది. టాలీవుడ్ సెలబ్రెటీలంతా తట్టా, బుట్టా పట్టి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మాకేం తక్కువా అంటూ.. మెగా స్టార్ ఇంట్లోని ఈ తరం మహిళలందరూ తాజాగా మేకప్‌, నో మేకప్‌ చాలెంజ్ తో మెప్పించారు. […]

Update: 2020-04-27 06:02 GMT

దిశ వెబ్ డెస్క్: ఎప్పుడూ షూటింగ్ లతో బిజీబిజీగా గడిపే సెలబ్రెటీలంతా వంట‌లు, వ్యాయామాలు చేస్తూ.. కుటంబంతో హయిగా గడిపేస్తున్నారు. అంతేకాదు కొత్త కొత్త చాలెంజ్‌లు విసురుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ‘బీ ది రియ‌ల్ మేన్’ చాలెంజ్ నెట్టింట్లో వైరల్ గా మారింది. టాలీవుడ్ సెలబ్రెటీలంతా తట్టా, బుట్టా పట్టి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మాకేం తక్కువా అంటూ.. మెగా స్టార్ ఇంట్లోని ఈ తరం మహిళలందరూ తాజాగా మేకప్‌, నో మేకప్‌ చాలెంజ్ తో మెప్పించారు. ఈ త‌ర‌హాలోనే ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ పెద్ద కొడుకు వెంక‌టేశ్ భార్య నీలు షా స‌రికొత్త‌గా ఫ‌న్నీ చాలెంజ్ విసిరింది.

లాక్డౌన్ వేళ కొత్త కొత్త చాలెంజ్ లు తెరమీదకు వస్తున్నాయి. ఇటీవలే ఆయేషా శర్మ, నేహా శర్మ సిస్టర్స్ టీ షర్ట్ చాలెంజ్ తో సెలబ్రెటీలకు సవాల్ విసిరారు. ఆ తర్వాత హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ‘పిల్లో చాలెంజ్’ తో నెట్టింటిని షేక్ చేసింది. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ పెద్ద కుమారుడు అల్లు వెంకటేశ్‌(బాబీ) భార్య నీలు షా సరికొత్త ఫన్నీ చాలెంజ్‌ ను మన ముందుకు తీసుకు వచ్చింది. ఎలాంటి గోడ ఆధారం లేకుండా.. నేలపైన శీర్షాసనం వేశారు. అలా ఉన్న ఆమె.. ఓ కాలితో మరో కాలికి ఉన్న షూ సాక్స్ ను అవలీలగా తొలగించారు. అలా రెండు పాదాలకున్న సాక్సులు తీశారు. ఇది ఎలా చేయాలో క్లియర్ గా వీడియో లో చూపించి .. ఇంకేముంది ఇలా మీరు చేయండి అంటూ సవాల్ విసిరింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, క్వారెంటైన్‌లో ఈ ఫ‌న్నీ చాలెంజ్ అంద‌రూ స్వీక‌రించండంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు ఇళ్లలో ఉండాలని.. సురక్షితంగా ఉండాలని ఆమె కోరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నట్లు నీలు షా డ్యాన్స్ , యోగాల్లో స్పెషలిస్ట్ .

tags : allu neelu shah, new funny challenge, social media, telugu industry

Tags:    

Similar News