కరోనా కట్టడికి బన్నీ విరాళం

దిశ, వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా మహమ్మారిపై పోరాటానికి అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను అభినందించిన బన్నీ…. కోవిడ్ 19 వ్యాధి జనజీవనాన్ని స్తంభింపజేసిందన్నారు. కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మీడియా … రిస్క్ ఉన్నా కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారని అభినందించారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని తన వంతు సాయంగా తెలంగాణ, ఏపీ, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి మొత్తంగా రూ. […]

Update: 2020-03-27 01:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా మహమ్మారిపై పోరాటానికి అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను అభినందించిన బన్నీ…. కోవిడ్ 19 వ్యాధి జనజీవనాన్ని స్తంభింపజేసిందన్నారు. కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మీడియా … రిస్క్ ఉన్నా కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారని అభినందించారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని తన వంతు సాయంగా తెలంగాణ, ఏపీ, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి మొత్తంగా రూ. 1.25 కోట్ల రూపాయల విరాళాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో మనం చేసేది చేయగలిగింది ఒక్కటే.. చేతులను శుభ్రంగా ఉంచుకుంటూ… ఇంట్లో ఉండడమే అని తెలిపారు. పాజిటివ్‌గా .. సురక్షితంగా ఉండాలని కోరారు.


Tags: Allu Arjun, Bunny, Contribution, CoronaVirus, Covid19

Tags:    

Similar News