జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై అల్లం నారాయణ క్లారిటీ..
దిశ ప్రతినిధి, వరంగల్ : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీపై మీడియా అకాడమీ చెర్మన్ అల్లం నారాయణ మరోసారి స్పందించారు. కోటి వృక్షార్చనలో భాగంగా వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2వేల మంది జర్నలిస్టులు కొవిడ్ బారిన పడితే రూ.3.5కోట్ల సాయం అందించామన్నారు. సీఎం కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. జర్నలిస్టుల స్థలాల పంపిణీ వ్యవహారం సుప్రీంకోర్టులో […]
దిశ ప్రతినిధి, వరంగల్ : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీపై మీడియా అకాడమీ చెర్మన్ అల్లం నారాయణ మరోసారి స్పందించారు. కోటి వృక్షార్చనలో భాగంగా వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2వేల మంది జర్నలిస్టులు కొవిడ్ బారిన పడితే రూ.3.5కోట్ల సాయం అందించామన్నారు. సీఎం కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. జర్నలిస్టుల స్థలాల పంపిణీ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉండటం వల్ల ఆ ప్రక్రియ ఆలస్యం అవుతోందన్నారు.
సుప్రీంకోర్టుకు సంబంధం లేకుండా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వివరించారు.ఇళ్ల స్థలాల విషయంలో జర్నలిస్టులు నిరుత్సాహ పడొద్దని అల్లం నారాయణ కోరారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ శ్రీధర్ రెడ్డి, పెరుమాండ్ల వెంకట్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్, టెంజు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఇస్మాయిల్, రమణ, సీఎం పీఆర్వో రమేష్ హజారే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్. లెనిన్, రాష్ట్ర నాయకులు తడుక రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు.