కేంద్ర చట్టాలను వ్యతిరేకించండి: అల్లం నారాయణ

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం ప్రవేశపెడుతున్న నల్ల చట్టాలను వ్యతిరేకించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లం నారాయణ మాట్లాడుతూ.. మోడీ రెండోసారి ప్రధానిగా అయ్యాక ఫెడరల్ విధానాలను ప్రవేశపెడుతున్నారని విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా […]

Update: 2021-08-07 11:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం ప్రవేశపెడుతున్న నల్ల చట్టాలను వ్యతిరేకించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లం నారాయణ మాట్లాడుతూ.. మోడీ రెండోసారి ప్రధానిగా అయ్యాక ఫెడరల్ విధానాలను ప్రవేశపెడుతున్నారని విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో నేటికీ రైతుల ధర్నా కొనసాగుతూనే ఉందన్నారు. ఇది ప్రపంచంలోనే రైతులు చేస్తున్న అతి పెద్ద పోరాటమని ఆయన చెప్పారు. రైతులకు తోడు ఒకవైపు పెగాసెస్, మరో వైపు జంతర్ మంతర్ వద్ద విద్యుత్ ఉద్యోగుల ధర్నా చేపడుతూ కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నా ఇలాంటి చర్యలకు దిగడం సరికాదన్నారు.

Tags:    

Similar News