విచిత్రమైన కేసు: తల్లా.. పెళ్లామా .. కోర్టునే సందిగ్ధంలో పడేసిన బాలుడు
దిశ, వెబ్‌డెస్క్: తన కొడుకు తనకే కావాలని ఓ తల్లి.. తన భర్తను తన వద్దకే పంపించాలని ఓ భార్య కోర్టుకెక్కిన వింత ఘటన అలహాబాద్ హైకోర్టు లో వెలుగుచూసింది. మైనర్ గా ఉన్నప్పుడే ఓ మేజర్ యువతి పెళ్ళాడిన ఆ బాలుడి తల్లి తన బిడ్డ తన వద్దే ఉండడానికి అనుమతి ఇవ్వమంటూ కోర్టుమెట్లెక్కింది. ఇక ఈ వింత కేసు పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వాదోపవాదాలు విన్న తర్వాత ఈ కేసుకు సంబంధించిన […]
దిశ, వెబ్‌డెస్క్: తన కొడుకు తనకే కావాలని ఓ తల్లి.. తన భర్తను తన వద్దకే పంపించాలని ఓ భార్య కోర్టుకెక్కిన వింత ఘటన అలహాబాద్ హైకోర్టు లో వెలుగుచూసింది. మైనర్ గా ఉన్నప్పుడే ఓ మేజర్ యువతి పెళ్ళాడిన ఆ బాలుడి తల్లి తన బిడ్డ తన వద్దే ఉండడానికి అనుమతి ఇవ్వమంటూ కోర్టుమెట్లెక్కింది. ఇక ఈ వింత కేసు పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వాదోపవాదాలు విన్న తర్వాత ఈ కేసుకు సంబంధించిన కీలక ఆదేశాన్ని జారీ చేసింది. వివరాలలోకి వెళితే..
ఆజంగఢ్ కు చెందిన ఓ పదహారేళ్ల(16) కుర్రాడు ఓ మేజర్ యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. అంతేకాకుండా గత ఏడాది మరో బిడ్డకు తండ్రికూడా అయ్యాడు. దీంతో బాలుడి తల్లి గత ఏడాది సెప్టెంబరు 18న కోర్టు వారికి పిటిషన్ దాఖలు చేసింది. మైనార్టీ తీరని తన కొడుకును మేజర్ యువతి పెళ్లి చేసుకుందని.. ఆ పెళ్లి చెల్లుబాటు కాదని పేర్కొంటూ తనకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని కోరింది. అంతేకాకుండా బాలుడు మేజర్ అయ్యేవరకు తన వద్దే ఉండేవిధంగా తీర్పును ఇవ్వాలని కోరింది. ఇక ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం మైనర్ బాలుడ్ని తల్లి వెంట వెళ్లమని చెప్పగా.. ఆ కుర్రాడు ససేమిరా అన్నాడు. తాను తన భార్య వద్దే ఉంటానని, తల్లితో వెళ్లనని తెగేసి చెప్పడంతో కోర్టు సందిగ్ధంలో పడింది.
బాలుడు చెప్పిన ప్రకారం భార్య వద్దే ఉండడానికి అనుమతిస్తే ..మేజర్ అయిన యువతితో సహజీవనం ఫోక్సో చట్టం ప్రకారం నేరమవుతుంది. తల్లితో వెళ్లమని చెప్తే బాలుడు మొరాయిస్తున్నాడు. దీంతో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో న్యాయస్థానం కీలక ఆదేశాన్ని జారీ చేసింది. బాలుడు మేజర్ అయ్యేవరకు అటు భార్య దగ్గర, ఇటు తల్లి దగ్గర కాకండా ప్రభుత్వ ఆధ్వర్యంలోని షెల్టర్ హోంకు తరలించాలని ఆదేశాలు జారీచేసింది. గత నెల 31న కోర్టు ఈ తీర్పు వెల్లడించగా, రెండు వారాల తర్వాత కోర్టు వెబ్‌సైటులో పెట్టిన ఈ కేసు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.