రెండ్రోజులు వెబ్‌సైట్‌లు బంద్.. కారణమిదే..!

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్లన్నీ రెండు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. కొన్ని ఆన్‌లైన్ సేవలు కూడా ఆగిపోనున్నాయి. స్టేట్ డాటా సెంటర్‌లో కొన్ని మరమ్మత్తు పనులు చేయాల్సి ఉన్న కారణంగా ఈ నెల 9వ తేదీ రాత్రి 9.00 గంటల నుంచి 11వ తేదీ రాత్రి 9.00 గంటల వరకు పూర్తిగా రెండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్లు, ప్రభుత్వం నిర్వహించే ఆన్‌లైన్ సేవలు, ప్రభుత్వ వెబ్‌‌సైట్ల మీద ఆధారపడి నడిచే […]

Update: 2021-07-07 22:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్లన్నీ రెండు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. కొన్ని ఆన్‌లైన్ సేవలు కూడా ఆగిపోనున్నాయి. స్టేట్ డాటా సెంటర్‌లో కొన్ని మరమ్మత్తు పనులు చేయాల్సి ఉన్న కారణంగా ఈ నెల 9వ తేదీ రాత్రి 9.00 గంటల నుంచి 11వ తేదీ రాత్రి 9.00 గంటల వరకు పూర్తిగా రెండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్లు, ప్రభుత్వం నిర్వహించే ఆన్‌లైన్ సేవలు, ప్రభుత్వ వెబ్‌‌సైట్ల మీద ఆధారపడి నడిచే సేవలన్నీ నిలిచిపోనున్నట్లు డాటా సెంటర్ ఒక ప్రకటనలో తెలిపింది. సమైక్య రాష్ట్రంలో 2010లో గచ్చిబౌలిలోని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సెంటర్ ప్రాంగణంలో నడుస్తున్న స్టేట్ డాటా సెంటర్ అనే ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ఆన్‌లైన్ సేవలను అందిస్తున్నది. ఆయా శాఖలు, విభాగాలు నిర్వహించే వెబ్‌సైట్లు, వాటిల్లో వాడే అప్లికేషన్లు ఈ డాటా సెంటర్ నుంచే పనిచేస్తున్నాయి. జీ2చ (గవర్నమెంట్ టు సిటిజెన్), జీ2జీ (గవర్నమెంట్ టు గవర్నమెంట్) కార్యకలాపాలన్నీ ఈ డాటా సెంటర్‌పై ఆధారపడి పనిచేస్తున్నాయి.

అప్పటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిరంతరాయంగా సేవలందించేందుకు, కరెంటు పోయినా సేవలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆనాటి ప్రమాణాల ప్రకారం యూపీఎస్ సౌకర్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కానీ ఇటీవలి కాలంలో వెబ్‌సైట్ల వినియోగం, వాటిపై ఆధారపడే ఆన్‌లైన్ సేవలు ఎక్కువ కావడంతో అవసరాలకు తగినట్లుగా విద్యుత్ డిమాండ్‌కు తగిన ఏర్పాట్లు (ఎక్కువ సామర్థ్యం కలిగిన యూపీఎస్) చేసుకోవాల్సి ఉందని, దానిలో భాగంగా కొత్త యూపీఎస్‌ను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని డాటా సెంటర్ ఆపరేటర్ నుంచి వచ్చిన సిఫారసుల మేరకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని సెర్వర్లు, కంప్యూటర్లను నిలిపివేసి కొత్త యూపీఎస్‌ను కనెక్ట్ చేయాల్సి ఉన్నందున రెండు రోజుల పాటు అన్ని వెబ్‌సైట్లు, వాటిపై ఆధారపడి అమలవుతున్న ఆన్‌లైన్ సేవలు సైతం నిలిచిపోనున్నట్లు డాటా సెంటర్ ఆ ప్రకటనలో తెలిపింది.

Tags:    

Similar News