మఖ్దూం భవన్‌లో అఖిలపక్ష సమావేశం

దిశ,న్యూస్‌బ్యూరో: ప్రభుత్వం సూచించిన పంటలు వేయకుంటే రైతు బంధు బంద్ అని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఇది బెదిరింపు ధోరణి అని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. సోమవారం హైదరాబాద్ మఖ్దూం భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, టీజెఎస్ అధ్యక్షుడు ఎమ్ కోదండరామ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, టీడీపీ సీనియర్ నాయకులు […]

Update: 2020-05-11 11:34 GMT

దిశ,న్యూస్‌బ్యూరో: ప్రభుత్వం సూచించిన పంటలు వేయకుంటే రైతు బంధు బంద్ అని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఇది బెదిరింపు ధోరణి అని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. సోమవారం హైదరాబాద్ మఖ్దూం భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, టీజెఎస్ అధ్యక్షుడు ఎమ్ కోదండరామ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, టీడీపీ సీనియర్ నాయకులు పీ సాయిబాబా, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి సుధాకర్, హైకోర్టు న్యాయవాది వసుధలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ ఉద్యోగాలు గిరిజనులకే కల్పించే జీవో నెం3ను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, వలస కార్మికులు, అసంఘటిత కార్మికులకు సమస్యలపై చర్చించారు.

Tags:    

Similar News