ఎన్నారైలంతా కేసీఆర్ వెంటే..
దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నారైలు నిరంతరం అవినీతి రహిత సమాజాన్ని కోరుకుంటున్నారని, ఎన్నారైలంతా కేసీఆర్ వెంటే ఉన్నామని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అమెరికాలోని ఎన్నారైలతో సమావేశమైనట్టు వార్తల్లో చూశానని, ఈటల 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఒక్కనాడు కూడా ఒక మాట సాయం చేయని వారు సమావేశం పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నారైలంతా వీరిని చూసి నవ్వుకుంటున్నారన్నారు. ప్రతీ ఒక్కరికి […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నారైలు నిరంతరం అవినీతి రహిత సమాజాన్ని కోరుకుంటున్నారని, ఎన్నారైలంతా కేసీఆర్ వెంటే ఉన్నామని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అమెరికాలోని ఎన్నారైలతో సమావేశమైనట్టు వార్తల్లో చూశానని, ఈటల 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఒక్కనాడు కూడా ఒక మాట సాయం చేయని వారు సమావేశం పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నారైలంతా వీరిని చూసి నవ్వుకుంటున్నారన్నారు. ప్రతీ ఒక్కరికి ఎవరితోనైనా సమావేశం పెట్టుకోవచ్చని ఎన్నారైల పేరుతో సమావేశం పెట్టి రాజకీయ విమర్శలు చేయడం ఎంత వరకు సబబో ఎన్నారైలు ఆలోచించాలని సూచించారు.
దమ్ముంటే నేటి వరకు ఈటల కోసం ఏం చేశారో సమావేశంలో పాల్గొన్న సభ్యులు స్పష్టం చేయాలని సవాల్ చేశారు. ఇందులో పాల్గొన్న వారంతా టీఆర్ఎస్ వ్యతిరేకులని, ప్రతిపక్ష పార్టీల సభ్యులేనని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే కాదు దేశం బయట కూడా సామాజిక న్యాయం పాటించి ఎన్నో దేశాల్లో బలహీన వర్గాలకు చెందిన కార్యకర్తలకు అధ్యక్ష పదవులు ఇచ్చారని తెలిపారు. ఒక బీసీ బిడ్డగా తనకు కేసీఆర్ ఎంతో గౌరవమిచ్చి ఉద్యమ సమయంలో ఎన్నారై టీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. ఇతర పార్టీ ఎన్నారై శాఖల్లో సామాజిక న్యాయం లేదని అన్నారు.